Share News

Nara Lokesh: ఇన్నోవేషన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా ఏపీ

ABN , Publish Date - Aug 21 , 2025 | 04:48 AM

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం త్వరలోనే ఇన్నోవేషన్‌ వ్యాలీ ఆ ఫ్‌ ఇండియాగా అభివృద్ధి చెం దుతుందని మంత్రి లోకేశ్‌ ...

Nara Lokesh: ఇన్నోవేషన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా ఏపీ

  • నాన్న కూడా విజయవంతమైన పారిశ్రామికవేత్తే : లోకేశ్‌

అమరావతి/మంగళగిరి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం త్వరలోనే ఇన్నోవేషన్‌ వ్యాలీ ఆ ఫ్‌ ఇండియాగా అభివృద్ధి చెం దుతుందని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే సృజనాత్మక ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి సా రించాలని సూచించారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో కలసి పనిచేసేందుకు సి ద్ధంగా ఉన్నామని చెప్పారు. బు ధవారం మంగళగిరిలోని మయూరి టెక్‌లో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ‘‘రతన్‌ టాటా గౌరవార్థం రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ హబ్‌ను నిర్మించాలని నిర్ణయించాం. ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేసిన మయూరి టెక్‌ ఒక భవనం కాదు.. లక్షలాది మంది యు వతకు ఆశాకిరణం. ఈ హబ్‌ ద్వారా వినూత్న ఆలోచనల ను ప్రోత్సహిస్తాం. మహిళల వినూత్న ఆలోచనలకు, వ్యాపారాభివృద్ధికి సహకారాన్ని అందిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ నగరాన్ని ఐటీ హబ్‌గా మార్చిన ఘనత చంద్రబాబుదే. సహజంగా ఒక నాయకుడికి ఒక నగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. కానీ చంద్రబాబుకు అమరావతి నగరాన్ని కూడా అభివృద్ధి చేసే అరుదైన అవకాశం దక్కింది. ఆయన మంత్రివర్గంలో పని చేయడం చాలా కష్టం. ఉదయం పది గంటలకు ఫోన్‌ చేసి ఒక అసైన్‌మెంట్‌ ఇచ్చి మళ్లీ 15 నిమిషాల్లోనే ఏమైందంటూ రిజల్ట్‌ గురించి ఆరా తీస్తారు. చంద్రబాబు వద్ద రెండోసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. 2019-24 మధ్య కాలంలోని పారిశ్రామిక వ్యతిరేక విధానా ల ఆనవాళ్లను తుడి చేసి, రాష్ట్ర పారిశ్రామికరంగంలో కొత్త రూపురేఖలను తీసుకువచ్చాం.’’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 04:48 AM