Industrial Growth: పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ బెస్ట్
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:29 AM
పరిశ్రమల ఏర్పాటుకు, వ్యాపార నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్..
ఈఐయూ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రానికి నాలుగో స్థానం
తొలి మూడు స్థానాల్లో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర
అమరావతి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల ఏర్పాటుకు, వ్యాపార నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత అనుకూల వాతావరణం ఉందని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) 2025 ర్యాంకింగ్స్ స్పష్టం చేశాయి. ఈ ర్యాంకింగ్స్‌లో ఏపీ 6.9 స్కోరుతో నాలుగో స్థానంలో నిలిచింది. ఢిల్లీ, కర్ణాటక కూడా ఏపీతో కలిసి నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. తెలంగాణ 6.8 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచింది. తమిళనాడు 7.4 స్కోరుతో ప్రథమ స్థానంలో నిలవగా.. గుజరాత్ 7.3 స్కోరుతో రెండో స్థాన ంలో, మహారాష్ట్ర 7.1 స్కోరుతో మూడో స్థానంలో నిలిచా యి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం, వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ఏపీని వ్యాపార అనుకూల రాష్ట్రాల్లో ముందువరుసలో నిలబెట్టాయని ఈఐయూ నివేదిక తెలిపింది. ఈఐయూ నివేదికలోని అంశాలను బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు వివరించారు.