Women safety: మహిళల భద్రతకు శక్తి వాట్సాప్
ABN , Publish Date - May 28 , 2025 | 06:20 AM
ఆంధ్రప్రదేశ్ మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ‘శక్తి’ యాప్ ద్వారా కోటిన్నర మందికి చేరువలో ఉన్న పోలీసు సేవలు వాట్సాప్ ద్వారా 79934 85111 నంబర్‌లో అందించబడతాయి అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
79934 85111 విడుదల చేసిన డీజీపీ
అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్నారుల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం.. ‘శక్తి’ యాప్ ద్వారా కోటిన్నర మందికి దగ్గరైన పోలీసు సేవలు ఇకపై వాట్సాప్ ద్వారా అందించబోతున్నాం. ఏ మహిళకు ఇబ్బంది వచ్చినా 79934 85111లో సంప్రదిస్తే చాలు.. వెంటనే పోలీసులు పరిష్కరిస్తారు’ అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో మంగళవారం ఈ నంబర్ ప్రారంభించిన డీజీపీ గుప్తా మాట్లాడుతూ.. ‘మహిళలు, చిన్నారుల జోలికి వస్తే జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News