Share News

Government Digital Transformation: ఏఐతో మెరుగైన పాలన

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:33 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ పరిజ్ఞానం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించారు. 400 మంది అధికారులను దశలవారీగా ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దే ప్రణాళికను ప్రకటించారు.

Government Digital Transformation: ఏఐతో మెరుగైన పాలన

ఉద్యోగులందరికీ దశలవారీగా శిక్షణ

నిరంతరాయంగా అవగాహన కార్యక్రమాలు

డిజిటల్‌ టెక్నాలజీతో వేగంగా పౌర సేవలు: సీఎస్‌

ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఏఐ పరిజ్ఞానం అందించే లక్ష్యంతో రాష్ట్ర సచివాలయంలో ‘ఏఐ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ గవర్నమెంట్‌ డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ అంశంపై రెండు రోజుల వర్క్‌షా్‌పను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండో రోజు శుక్రవారం కూడా ఆ వర్క్‌షాప్‌ కొనసాగి విజయవంతంగా ముగిసింది. అఽధికారులకు ఏఐపై ప్రాక్టికల్స్‌తో హ్యాండ్స్‌-ఆన్‌ శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ అధికారులతో మాట్లాడారు. ప్రభుత్వశాఖల వారీగా డిజిటల్‌ ఆధారిత సేవల్లో పరిజ్ఞానం మరింత పెంచుకోవడానికి ఈ వర్క్‌షాప్‌ సహకరిస్తుందని చెప్పారు. ప్రత్యేకంగా 100 మంది ఏఐ రివల్యూషనిస్టులు, 100 మంది ఏఐ ఛాంపియన్లు, 200 మంది ఏఐ క్యాటలిస్టులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం ద్వారా దశల వారీగా రాష్ట్రంలోని అన్ని శాఖల సిబ్బందికీ కృత్రిమ మేధ పరిజ్ఞానం అందించేందుకు వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 26 , 2025 | 04:33 AM