Share News

Andhra Pradesh: ఫ్రీహోల్డ్‌లో ఉన్న పేదల భూముల్ని తీసుకోం

ABN , Publish Date - May 21 , 2025 | 03:46 AM

ఆంధ్రప్రదేశ్‌లో నాలా చట్టాన్ని రద్దు చేసి, సాదా బైనామాలను 2027 వరకు ల్యాండ్‌ రికార్డులుగా మార్చుకునే గడువును పొడిగిస్తామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. పేదల భూములను కాపాడుతూ ఫ్రీ హోల్డ్‌ భూములపై న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Andhra Pradesh: ఫ్రీహోల్డ్‌లో ఉన్న పేదల భూముల్ని తీసుకోం

పేదలకు న్యాయం జరిగేలా తుది నిర్ణయం

కక్ష సాధింపుగా ఎవరి భూముల్నీ 22ఏలో పెట్టం

సాదా బైనామాలను ల్యాండ్‌ రికార్డులుగా

మార్చుకునేందుకు 2027 వరకు గడువు పెంపు

రాష్ట్రంలో నాలా చట్టాన్ని రద్దు చేస్తాం: అనగాని

అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలా చట్టాన్ని రద్దు చేస్తామని, సాదా బైనామాలను ల్యాండ్‌ రికార్డులుగా మార్చుకునే గడువును 2027 వరకు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ ప్రకటించారు. ఫ్రీ హోల్డ్‌ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫ్రీ హోల్డ్‌లో ఉన్నా.. పేదల భూములను తీసుకోబోమని, ఎవరి భూముల్ని కక్ష సాధింపుగా 22ఏలో పెట్టాలనే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. మంగళవారం అమరావతి సచివాలయంలో భూ పరిపాలనలో సంస్కరణలపై మంత్రి సత్యప్రసాద్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్‌, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, పి.నారాయణ, టీజీ భరత్‌ పాల్గొన్నారు. ఫ్రీ హోల్డ్‌ భూములు, 22ఏ నుంచి భూముల తొలగింపు, నాలా రద్దు, సాదా బైనామాలపై చర్చించారు. ఆ అంశాలను అనగాని మీడియాకు వెల్లడించారు. ఫ్రీ హోల్డ్‌ భూముల్లో 10 కేటగిరీలకు గానూ 8 కేటగిరీలకు ఉపసంఘం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని తెలిపారు. దాదాపు 3-4 లక్షల ఎకరాల భూములను గత ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తమ అనుయాయులకు ఫ్రీ హోల్డ్‌ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సర్వే నంబరులోని 30 ఎకరాల్లో 22ఏలో రెండు ఎకరాలు ఉంటే.. మొత్తం భూమిని పెట్టిన పరిస్థితి ఉందన్నారు. అన్నిటినీ పరిశీలించి, నిజమైన భూయజమానులు, పేదలకు నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎస్టేట్‌, ఈనామ్‌, ఎండోమెంట్‌ భూములపైనా చర్చిస్తామన్నారు. ఉండాల్సిన ఆస్తులుకంటే ఎక్కువగా ఉన్నాయని, ఇవెలా వచ్చాయో తెలియడం లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 03:46 AM