Share News

AP Cabinet Meeting: నేడు క్యాబినెట్‌ సమావేశం

ABN , Publish Date - Jun 04 , 2025 | 05:07 AM

నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరుగనుంది. అమరావతి భూసేకరణ, జీఏడీ టవర్ టెండర్లు, అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం, కూటమి ఏడాది పాలనపై చర్చ జరుగుతుంది.

AP Cabinet Meeting: నేడు క్యాబినెట్‌ సమావేశం

  • కూటమి ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. అమరావతి నిర్మాణం, రెండో దశకు అవసరమైన 44 వేల ఎకరాల భూసేకరణ అంశంపై చర్చ జరగనుంది. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్‌ టెండర్లకు, హెచ్‌వోడీ భవనాల 4 టవర్లకు, అమరావతిలో 5 వేల ఎకరాల్లో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం తెలపనుంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ జరగనుంది. జూన్‌ 21న విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లుపై కూడా క్యాబినెట్‌లో చర్చించనున్నారు.

Updated Date - Jun 04 , 2025 | 05:08 AM