Share News

ఏపీ, టీ నుంచి పది మంది ఇంజనీర్ల ‘పరస్పర’ బదిలీలు

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:55 AM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జల వనరుల శాఖ ఏఈఈ, డీఈఈలు పదేసి మంది చొప్పన పరస్పర అంగీకారంతో బదిలీలకు రాష్ట్ర జల వనరుల శాఖ ఆమోదం తెలిపింది.

ఏపీ, టీ నుంచి పది మంది ఇంజనీర్ల ‘పరస్పర’ బదిలీలు

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన జల వనరుల శాఖ ఏఈఈ, డీఈఈలు పదేసి మంది చొప్పన పరస్పర అంగీకారంతో బదిలీలకు రాష్ట్ర జల వనరుల శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖకు చెందిన పది మంది ఇంజనీరింగ్‌ అధికారులను తెలంగాణకు రిలీవ్‌ చేస్తూ .. తెలంగాణ నుంచి పది మంది ఇంజనీర్లు ఏపీలోకి తీసుకునేందుకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - Jan 17 , 2025 | 04:55 AM