Liquor Policy Reform: ప్రయోజనకరమైన మద్యం పాలసీ
ABN , Publish Date - May 09 , 2025 | 05:18 AM
రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండే ఉత్తమ మద్యం పాలసీ రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై, మైక్రో బ్రూవరీలు, బార్ పాలసీ, నాణ్యత వంటి అంశాలపై చర్చించుకుంది
మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉత్తమ మద్యం విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వం ఎక్సైజ్‌పై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. మంగళగిరిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో గురువారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్ ఈ సమావేశంలో పాల్గొని రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న ఎక్సైజ్ విధానంపై సమీక్షించారు. గతంతో పోలిస్తే మద్యం నాణ్యత పెరిగిందని, 99శాతం మంది వినియోగదారులు సంతృప్తిగా ఉన్నారని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత కొత్త బార్ పాలసీతోపాటు వివిధ విధాన ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించారు. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న మైక్రో బ్రూవరీ విధానాలపై సమీక్షించారు. మద్యంషాపుల లైసెన్సుదారులంద రూ మార్గదర్శకాలు పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.