నేటి నుంచి జైనబ్బీ దర్గా ఉరుసు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:06 AM
స్థానిక బీబీ జైనబ్బీ అమ్మవారి ఉరుసు ఉ త్సవాలను బుధవారం నుంచి మూడు రోజు ల పాటు నిర్వహించనున్నారు.
ఉరవకొండ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): స్థానిక బీబీ జైనబ్బీ అమ్మవారి ఉరుసు ఉ త్సవాలను బుధవారం నుంచి మూడు రోజు ల పాటు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దర్గాను స ర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. గంధంతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం అల్లపరెడ్డి ఇంటి నుంచి గంధం ఊరేగింపుగా మొదలై.. దర్గాకు చేరనుంది. గురువారం షంషేర్ ఊరేగింపు, శుక్రవారం అమ్మవారికి చాదర్‌ను ఊరేగింపు ఉంటుంది. అదేరోజు రాత్రి దర్గా ఆవరణలో కవాలి పోటీలతో ఉత్సవాలు ముగుస్తాయి.