Share News

నదిలో చిక్కుకున్న యువకులు

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:32 AM

మండలంలోని వేపులపర్తి సమీపంలో వేదవతి హగరిపై ఆదివారం రాత్రి బీటీ ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు వచ్చిన నీటి ఉధృతికి రోడ్డు కోతకు గురైంది.

నదిలో చిక్కుకున్న యువకులు
తాడుతో బయటకు లాగుతున్న స్థానికులు

బ్రహ్మసముద్రం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని వేపులపర్తి సమీపంలో వేదవతి హగరిపై ఆదివారం రాత్రి బీటీ ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు వచ్చిన నీటి ఉధృతికి రోడ్డు కోతకు గురైంది. సోమవారం తెల్లవారుజామున రాయదుర్గం వైపు నుంచి ఇద్దరు యువకులు బైకుపై వచ్చి ప్రమాదవశాత్తు హగరి నదిలోకి కొట్టుకుపోయారు. కొంతదూరం నీటి ప్రవాహంలో బైకుతోపాటు ఇద్దరు కొట్టుకుపోయి.. అక్కడే బైకు పట్టుకుని నిలబడ్డారు. అటుగా వచ్చిన స్థానికులు గమనించి తాళ్ల సాయంతో వారిని బయట లాగి రక్షించారు.

Updated Date - Nov 04 , 2025 | 01:32 AM