Share News

celebrations ముగిసిన యల్లమ్మ ఉత్సవాలు

ABN , Publish Date - May 14 , 2025 | 12:08 AM

మండల కేంద్రంలో నా లుగు రోజులుగా నిర్వహిస్తున్న యల్లమ్మ తిరునాళ్ల మంగళవారం తో ముగిశాయి. వివిధ కార్యక్రమాలతో ఈ తిరునాళ్లను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

celebrations  ముగిసిన యల్లమ్మ ఉత్సవాలు
ఊరేగింపుగా తీసుకొస్తున్న జ్యోతులు, బోనాలు

నంబులపూలకుంట, మే 13(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో నా లుగు రోజులుగా నిర్వహిస్తున్న యల్లమ్మ తిరునాళ్ల మంగళవారం తో ముగిశాయి. వివిధ కార్యక్రమాలతో ఈ తిరునాళ్లను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జామున భక్తు లు జ్యోతులు, బానాలు అమ్మవారికి సమర్పించారు. జ్యోతులను ఇళ్ల వద్ద నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి.. ఆలయం చుట్టు ప్రదక్షణలు చేసి, అమ్మవారికి సమర్పించుకున్నారు.

Updated Date - May 14 , 2025 | 12:08 AM