'YCP' ‘వికలాంగ పింఛన్లపై వైసీపీ దుష్ప్రచారం’
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:01 AM
వికలాంగ పింఛన్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వికలాంగులు, వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన చైర్మన గడిపూటి నారాయణస్వామి మండిపడ్డారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
అనంతపురం క్రైం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): వికలాంగ పింఛన్లపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వికలాంగులు, వృద్ధ పౌరుల సహాయ కార్పొరేషన చైర్మన గడిపూటి నారాయణస్వామి మండిపడ్డారు. నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
తనను కార్పొరేషన చైర్మనగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్‌కు, మంత్రి నారాలోకే్‌షకు, బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగ ఫించన్లపై వైసీపీ మూకలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అనర్హులకు కూడా పింఛన్లు అందించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అనర్హులను గుర్తించి తొలగించిందన్నారు. ఆ నిధులతో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు. అయితే వైసీపీ మూకలు దుష్ప్రచారం చేస్తే...వికలాంగులు ఎవరూ సహించరని, ఖబడ్డార్ అంటూ ఆయన హెచ్చరించారు.
మరిన్ని అనంతపుంర వార్తల కోసం...