మార్కెట్ యార్డుపై వైసీపీ దాడి తగదు
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:32 AM
అనుమతులూ లేకుండా మార్కెట్ యార్డులోకి వచ్చిన వైసీపీ నాయకులు ఆందోళన చేయడమే కాకుండా దాడి చేస్తామని హెచ్చరించడం ఏమిటని యార్డు కమిటీ డైరెక్టర్లు, టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
గుంతకల్లు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): అనుమతులూ లేకుండా మార్కెట్ యార్డులోకి వచ్చిన వైసీపీ నాయకులు ఆందోళన చేయడమే కాకుండా దాడి చేస్తామని హెచ్చరించడం ఏమిటని యార్డు కమిటీ డైరెక్టర్లు, టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం సాయంత్రం స్థానిక మార్కెట్ యార్డులో వారు మాట్లాడారు. కొత్తగా నిర్మించిన రైతు బజార్ సముదాయానికి కమిటీ తీర్మానం లేకుండానే వైఎ్‌సఆర్ పేరు పెట్టారని, దీంతో కమిటీ తీర్మానంతో ఆ పేరును తొలగించామని అన్నారు. ఈ కారణంగా వైసీపీ నాయకులు మార్కెట్ యార్డులోకి వచ్చి ఆందోళన చేశారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో యార్డు కమిటీ వైస్ చైర్మన రాణా ప్రతాప్, డైరెక్టర్లు ప్రసాద్, శ్రీదేవి, వీరాంజనేయులు, టీడీపీ నాయకుడు మత్రు నాయక్, జనసేన నాయకుడు రాఘవేంద్ర పాల్గొన్నారు.