Share News

వైసీపీ శవరాజకీయాలు మానాలి

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:14 AM

‘వైసీపీ నాయకులకు శవరాజకీయాలు చేయడం బాగా అలవాటైంది. ’ అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ధ్వజమెత్తారు.

వైసీపీ శవరాజకీయాలు మానాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గుమ్మనూరు

గుంతకల్లు, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ నాయకులకు శవరాజకీయాలు చేయడం బాగా అలవాటైంది. అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆహారం కూడా సక్రమంగా తీసుకోకుండా రోజూ మద్యం సేవిస్తూ గత ఆదివారం మద్యం షాపు వద్ద మరణించాడు. అతను అనారోగ్యంతోనే మరణించాడని, మద్యం వల్ల కాదని మెడికల్‌ రిపోర్టులు కూడా వచ్చాయి. అయినా వైసీపీ నాయకులు దీన్ని అడ్డుపెట్టుకుని ఆందోళనలకు దిగడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనం’ అని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ధ్వజమెత్తారు. గురువారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. వారి ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యాన్ని ప్రజలకు బలవంతంగా తాపి వేల మంది ప్రాణాలను బలికొన్న నాయకులు.. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంపై బురదజల్లే యత్నాలు చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు. ఇది దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్ద్దేవా చేశారు. ఇకనైనా అనవసరంగా బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు.

Updated Date - Oct 10 , 2025 | 12:14 AM