Share News

వైసీపీ నాయకులు ఆరోపణలు మానాలి

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:27 AM

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మానుకోవాలని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొండాపురం అనిల్‌చౌదరి హెచ్చరించారు.

వైసీపీ నాయకులు ఆరోపణలు మానాలి
మాట్లాడుతున్న కొండాపురం అనిల్‌ చౌదరి

కళ్యాణదుర్గంరూరల్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుపై వైసీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మానుకోవాలని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొండాపురం అనిల్‌చౌదరి హెచ్చరించారు. స్థానిక ప్రజావేదికలో టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. అభివృద్ధే ధ్యేయంగా ప్రజాసంక్షేమం కొరకు నిరంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాటుపడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు ఇసుక, మట్టి అక్రమాలు, అక్రమ మద్యం, కంకర అమ్మడం, కబ్జాలే అభివృద్ధి అని మండిపడ్డారు. నియోజకవర్గంలో అనేక పాఠశాలలకు డెస్కులు, పాఠశాల భవనాల నిర్మాణాలకు సొంత నిధులు కేటాయించిన ఘనత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు దక్కిందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ. 27 కోట్లతో సీసీ రోడ్లు, రూ. 4 కోట్లతో బీటీ రోడ్లు తదితర అభివృద్ధి పనులు ఎమ్మెల్యే అమిలినేని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ధనుంజయ, శివన్న, టీఆర్‌ తిప్పేస్వామి, సింగిల్‌ విండో అధ్యక్షులు మల్లిపల్లి నారాయణ, గోళ్ల వాటర్‌ షెడ్‌ ఛైర్మన బుజ్జన్న, మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ ధను నాయక్‌, మాజీ జెడ్పీటీసీ గురుప్రసాద్‌, మురళి, ఉరాల కుమార్‌, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:27 AM