వైసీపీ పనైపోయింది : ఎమ్మెల్యే
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:56 PM
నియోజకవర్గంలో వైసీపీ పని అయిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. గురువారం స్థానిక ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలంలోని పాపంపల్లికి చెందిన 11 యాదవ కుటుంబాల సభ్యులు వైసీపీ నుంచి టీడీపీలో చేశారు.
కళ్యాణదుర్గం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో వైసీపీ పని అయిపోయిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. గురువారం స్థానిక ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మండలంలోని పాపంపల్లికి చెందిన 11 యాదవ కుటుంబాల సభ్యులు వైసీపీ నుంచి టీడీపీలో చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో చేస్తు న్న అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి స్వచ్ఛందంగా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరుతున్నారన్నారు.
వైసీపీ విలవిల : కళ్యాణదుర్గం వైసీపీ నియోజకవర్గ సమన్వయ కర్త తలారి రంగయ్యకు వలసల ఫీవర్ పట్టుకుంది. ఒక్కొక్కరు పార్టీ నుంచి వెళ్లిపోతున్నారు. పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నెల 11న జరిగిన మున్సిపల్ చైర్మన ఎన్నిక నుంచి వలసలు మరింత పెరిగాయి. వైసీపీలో అంతర్గత విభేదాలతో బయటకు వచ్చేస్తున్నామని, అక్కడ ఉండలేకపోతున్నామని బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇంకా వైసీపీలో ఉంటే సర్వనాశనం కావడం ఖాయమని మున్సిపల్ వైస్ చైర్మన జయం ఫణీంద్ర, ఇద్దరు కౌన్సిలర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో పలువురు టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు.