చిరంజీవి పేరిట కసాపురంలో పూజలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:04 AM
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురష్కరించుకుని మంగళవారం ఉదయం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు, హోమం చేయించారు.
గుంతకల్లు, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పురష్కరించుకుని మంగళవారం ఉదయం కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో కూటమి నాయకులు ప్రత్యేక పూజలు, హోమం చేయించారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పూల రమణ, వక్కల ఉమ, భవాని రవికుమార్, టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణస్వామి, సింగిల్ విండో సొసైటీ అధ్యక్షుడు తలారి మస్తానప్ప, నాయకులు గుడిపాటి ఆంజనేయులు, ఫజులు, పత్తి హిమబిందు, వీరేశ కుమార్, రంజాన, గోవిందు, కొలిమి రామాంజనేయులు, శ్రీదేవి పాల్గొన్నారు.