Share News

అధ్వానంగా యాడికి - బుగ్గ రోడ్డు

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:23 AM

యాడికి నుంచి బుగ్గకు వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డంతా గుంతలు ఉండటంతో.. వాహనాలు ఎటువైపు వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది.

అధ్వానంగా యాడికి - బుగ్గ రోడ్డు
తిరుణాంపల్లి వద్ద గుంతలమయమైన రోడ్డు

యాడికి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): యాడికి నుంచి బుగ్గకు వెళ్లే ప్రధాన రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డంతా గుంతలు ఉండటంతో.. వాహనాలు ఎటువైపు వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. యాడికి గ్రామశివారులో, తిరుణాంపల్లి వద్ద, చిక్కేపల్లి వద్ద, నిట్టూరు వద్ద రోడ్డుపై ఉన్న పెద్దపెద్ద గుంతల్లో వర్షపునీరు నిలిచి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పాలకులు ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో మరీ అధ్వానంగా రోడ్డు మారింది. ఈ రోడ్డుపై అనేక మంది ద్విచక్రవాహనదారులు అదుపుతప్పి కిండపడి గాయపడ్డారు. అధికారులు స్పందించి.. ఈ రోడ్డును బాగు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:23 AM