problems కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:11 AM
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బీ మల్లికార్జున డిమాండ్ చేశారు.
రాయదుర్గంరూరల్, జూన 28(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి బీ మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు స్థానిక వినాయక కూడలి నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు శనివారం నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. జీఓ నెంబర్ 36 ప్రకారం కనీస వేతనం రూ. 24,500 ఇవ్వాలని, హెల్త్ అలవెన్స, రిస్క్ అలవెన్సులు ఇవ్వాలని, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలనుకుంటే ముందుగా మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వర్తింపజేయాలన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే జూలై 4న చలో విజయవాడ కార్యక్రమంతో పాటు నిరవధిక సమ్మె చేపడతాని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన అధ్యక్షుడు తిప్పేరుద్ర, నాయకులు నరసింహులు, మైలారి, శివానంద, శ్రీనివాసులు, రాము పాల్గొన్నారు.