Work pressure పని ఒత్తిడి తగ్గించాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:25 PM
తమపై పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు మండల అభివృద్ధి అధికారి లక్ష్మీశంకర్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు.
కుందుర్పి, జూన 26(ఆంధ్రజ్యోతి): తమపై పని ఒత్తిడి తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు మండల అభివృద్ధి అధికారి లక్ష్మీశంకర్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. స్వచ్ఛభారత షెడ్ల నిర్వహణలో శానిటేషనలో ఉదయం 7 గంటలలోగా హాజరు కావాలని, జీఎ్‌సడబ్ల్యూఎస్ సర్వేలకు ప్రతి డిపార్ట్‌మెంట్‌లో తమను బాధ్యులుగా చేస్తూ మెమోలు, సస్పెన్షన చేస్తున్నారని వాపోయారు. కేవలం మాతృశాఖకు సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఆనంద్, రాఘవ, రామాంజినేయులు హరీష్, నవీన ఓబుళపతి రాఘవేంద్ర పాల్గొన్నారు.