Share News

protest తాగునీటి కోసం మహిళల నిరసన

ABN , Publish Date - May 27 , 2025 | 11:43 PM

తాగునీరు లేక వారం రోజులుగా ఇబ్బం దులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని మున్సిపాల్టీ పరిధిలోని కుమ్మరపేటకు చెందిన మహిళలు మండిపడ్డారు.

protest తాగునీటి కోసం మహిళల నిరసన
కాళీబిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు

పుట్టపర్తి, మే 27(ఆంధ్రజ్యోతి): తాగునీరు లేక వారం రోజులుగా ఇబ్బం దులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదని మున్సిపాల్టీ పరిధిలోని కుమ్మరపేటకు చెందిన మహిళలు మండిపడ్డారు. ఈ మేరకు మంగళ వారం ఆ కాలనీలో కాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. తరచూ కాలనీలో తాగునీటి సమస్య తలెత్తుతున్నా సిబ్బంది పట్టించుకోలేదన్నారు. వారం క్రితం ఉన్న ఒక్క మోటారు కాలిపోయిందని, ఇంతవరకు దానికి మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. సమస్య పరిష్కరించకపోతే ము న్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమ ంలో సుబ్బలక్ష్మీ, శ్రీదేవి, ఉషారాణి, రజిత, సరాబి పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2025 | 11:43 PM