Share News

drinking water తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:48 PM

తమ కాలనీలకు పది రోజుల నుంచి తాగునీటి సరఫరా కావడం లేదని, నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడు తున్నామని స్థానిక బోయవారివీధి, కమ్మవారివీధి, ఆంజినేయస్వామివీధి, ఎస్సీ కాలనీ .. తదితర ప్రాంతాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

drinking water తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు
ఖాళీ బిందెలతో ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళలు

కూడేరు, జూన 2(ఆంధ్రజ్యోతి): తమ కాలనీలకు పది రోజుల నుంచి తాగునీటి సరఫరా కావడం లేదని, నీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడు తున్నామని స్థానిక బోయవారివీధి, కమ్మవారివీధి, ఆంజినేయస్వామివీధి, ఎస్సీ కాలనీ .. తదితర ప్రాంతాల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. పది రోజులుగా సత్యసాయి, ఉరవకొండ ప్రాజెక్టులతో పాటు పంచాయతీ నీరు కూడా రావడం లేదని, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోనే వారే కరువయ్యారని వాపోయారు. దాదాపు గంట పాటు రోడ్డుపై వారు బైఠాయించడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు వారికి నచ్చజెప్పారు. దీంతో మహిళలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.

Updated Date - Jun 02 , 2025 | 11:48 PM