Magistrate మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:22 AM
మహిళలు అన్ని రంగా ల్లో రాణించాలని ధర్మవరం కోర్టు సీనియర్ సివిల్ న్యాయాధికారి గీతావాణి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వాల్మీకి ఫంక్షన హాల్ నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహించారు.

ధర్మవరంరూరల్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగా ల్లో రాణించాలని ధర్మవరం కోర్టు సీనియర్ సివిల్ న్యాయాధికారి గీతావాణి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని వాల్మీకి ఫంక్షన హాల్ నిర్వహించిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం నిర్వహించారు. ఇందులో మండలంలోని 30 గ్రామాలకు సంబంధించి 345 మంది మహిళసభ్యులు పాల్గొన్నారు. ఇందులో న్యాయాధికారి మా ట్లాడుతూ.. మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం మహిళసంఘం సభ్యులకు ఆటలు పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. 2వ పట్టణ పోలీ్‌సస్టేషన వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం చేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ మాధవి, అడ్వకేట్లు బాలసుందరి, సుమలత, ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ ప్రమీల, ఏఎఫ్ ఎకాలజీ కో-ఆర్డినేటర్ రిజ్వాన, అరుణ, ఎంటీఎల్ దస్తగిరి, సీడీపీఓ లక్ష్మీ, పోస్ట్ ఉమెన సూర్యకల, కానిస్టేబుల్ నాగరత్నమ్మ, విష్ణు పాల్గొన్నారు.