Share News

dmho ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎందుకు కూల్చారు ?

ABN , Publish Date - May 28 , 2025 | 11:27 PM

మండలంలోని గొట్లూరు గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అనుమతు లు లేకుండా కేవలం ఆ గ్రామ వైసీపీ నాయకుల అండతో గ్రామానికి చెందిన కొంతమంది ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూల్చివేశారు.

dmho ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఎందుకు కూల్చారు ?
గ్రామస్థులతో మాట్లాడుతున్న డీఎంహెచఓ

ధర్మవరంరూరల్‌, మే 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని గొట్లూరు గ్రామంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి అనుమతు లు లేకుండా కేవలం ఆ గ్రామ వైసీపీ నాయకుల అండతో గ్రామానికి చెందిన కొంతమంది ఆరోగ్య ఉప కేంద్రాన్ని కూల్చివేశారు. దీనిపై ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది. అంతేకాకుండా గ్రా మస్థులు కూడా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎంహెచఓ ఫైరోజాబేగం బుధవారం ఆ గ్రామానికి వచ్చి గ్రామ పెద్దలు, ఇరువర్గాలతో సమావేశం నిర్వహించారు. అధికారుల అనుమతి లేకుం డా ప్రభుత్వ భవనాన్ని ఎందుకు కూల్చారని నిలదీశారు. ఆరోగ్య ఉప కేంద్రానికి స్థలాన్ని చూపించాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మెడికల్‌ ఆఫీసర్‌ దిలీ్‌పకుమార్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీరసర్‌ సాంబశివమ్మ, హెల్త్‌సూపర్‌వైజర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆరోగ్యసిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 11:27 PM