Share News

delay విచారణపై ఎందుకీ కాలయాపన?

ABN , Publish Date - May 21 , 2025 | 12:04 AM

‘పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలోని సర్వే నంబరు 650-2 అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టడంలో అధికారులు ఎందుకింత కాలయాపణ చేస్తున్నా రు.

delay విచారణపై ఎందుకీ కాలయాపన?
రిలే దీక్ష చేస్తున్న నాయకులు

ధర్మవరం, మే 20(ఆంధ్రజ్యోతి): ‘పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురంలోని సర్వే నంబరు 650-2 అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టడంలో అధికారులు ఎందుకింత కాలయాపణ చేస్తున్నా రు. రెండు నెలల నుంచి కలెక్టర్‌, ఆర్డీఓ, తహసీల్దార్‌ దృష్టికి తీసుకెళ్లినా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదు. మీపై రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉన్నాయా.. లేక మీరు కూడా ఏమైనా ముడుపులు తీసుకున్నారా.. అనర్హులకు పట్టాలు రద్దు చేసి.. అర్హులకు ఇవ్వడంలో ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు.’ అని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆ యన ఆధ్వర్యంలో ప్లంబర్స్‌, కార్మిక సంఘం, ఏ ఐటీయూసీ నాయకులు మంగళవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు అర్హులకు న్యాయం చేయకపోతే వారిని రోడ్డు మీదకు తీసుకువచ్చే విధంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని... తహసీల్దార్‌ కార్యాలయా న్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్‌, ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు ఎర్రంశెట్టి రమణ, ప్లంబర్స్‌ అండ్‌ ఎలకీ్ట్రషియన కార్మికసంఘం అధ్యక్షుడు గోవిందరాజు లు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయ ణ, మహిళా సమాఖ్య నాయకురాళ్లు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2025 | 12:04 AM