నీరు పారేదెలా ..!
ABN , Publish Date - Oct 18 , 2025 | 12:20 AM
మండలంలోని రేణుమాకులపల్లి సమీపంలోని 34వ ప్యాకేజీ డీ1 డిస్ర్టిబ్యూటరీ కాలువలో పిచ్చి మొక్కలు భారీగా పెరిగాయి.
ఉరవకొండ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని రేణుమాకులపల్లి సమీపంలోని 34వ ప్యాకేజీ డీ1 డిస్ర్టిబ్యూటరీ కాలువలో పిచ్చి మొక్కలు భారీగా పెరిగాయి. ఇంద్రావతి నుంచి రేణుమాకులపల్లి వరకూ సుమారు మూడు కిలోమీటర్ల మేర ఉన్న డిస్రి్ట్రబ్యూటరీ కాలువలో నీరు పారడమే కష్టంగా మారింది. ఈ కాలువ 20 క్యూసెక్కుల దాకా నీరు వదిలారు. కాలువలో ఆ నీరు ముందుకు వెళ్లడం గగనంగా మారింది. కాలువ పిచ్చిమొక్కలు, గుర్రపు డెక్క, ముళ్ల పొదలతో నిండిపోయింది. గత ఐదేళ్లూ సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.