పంటనష్టంపై విప్ ఆరా
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:43 PM
మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి సిద్దరాంపురం, చంద్రగిరి, కురువళ్లి, గోవిందవాడ గ్రామాల్లో మొక్కజొన్న, మిరప, వరి, వేరుశెనగ తదితర పంటలు నీటమునిగాయి
బొమ్మనహాళ్, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి సిద్దరాంపురం, చంద్రగిరి, కురువళ్లి, గోవిందవాడ గ్రామాల్లో మొక్కజొన్న, మిరప, వరి, వేరుశెనగ తదితర పంటలు నీటమునిగాయి. పంటనష్టంపై ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు రాయదుర్గం ఏడీఏ పద్మజతో శనివారం ఆరా తీశారు. పంట నష్టం వివరాలు సేకరించాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.