Share News

సమయ పాలన ఏదీ?

ABN , Publish Date - Sep 03 , 2025 | 12:29 AM

మండలంలోని శ్రీధరఘట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు, సి బ్బంది సమయపాలన లేక ... ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు.

సమయ పాలన ఏదీ?
ఉదయం 11 గంటలైనా తాళం తీయని శ్రీధరఘట్ట సొసైటీ కార్యాలయం

బొమ్మనహాళ్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీధరఘట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు, సి బ్బంది సమయపాలన లేక ... ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. రైతులు ఎరువులు, విత్తనాలు, బ్యాంకు రుణాలు తదితర వాటి కోసం వస్తున్న రైతులు.. ఆ సొసైటీ కార్యాలయం తాళం వేసి ఉండటంతో నిరాశతో వెనుతిరుగుతున్నారు. సోసైటీ సీఈఓ, సిబ్బంది అందుబాటలో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలైన సొసైటీ తలుపులు తీయకపోవడంపై అంతవరకూ నిరీక్షించిన రైతులు.. వెనుతిరిగారు.సొసైటీ ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవవహరిస్తున్నారని, సొసైటీ సిబ్బంది అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Sep 03 , 2025 | 12:29 AM