తరగతి మారేదెన్నడో..?
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:25 AM
మండలంలోని వేపరాల యూపీ పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఈ ఏడాది అప్‌గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారు.
రాయదుర్గంరూరల్, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని వేపరాల యూపీ పాఠశాలను ఉన్నత పాఠశాలగా ఈ ఏడాది అప్‌గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 12 గదులు కావాల్సి ఉండగా.. కేవలం నాలుగు గదులే ఉన్నాయి. దీంతో నాడు నేడు కింద అసంపూర్తిగా ఉన్న రెండు గదులతో పాటు వరండాలో, రేకులషెడ్డులో తరగతులు నిర్వహిస్తున్నారు. సరిపడా గదులు లేకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై హెచఎం శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా ... పాఠశాలలో గదుల కొరత తీవ్రంగా ఉందని, నాడు నేడు కింద అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాలను పూర్తి చేస్తే కొంతవరకు ఈ సమస్య తగ్గుతుందని తెలిపారు.