Share News

వైసీపీ హయాంలో మీ సంఘం ఏమైంది?

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:10 AM

వైసీపీ పాలనలో నా టి పాలకులు పోలీసులను ఎంత నీచంగా మాట్లాడినా నోరెత్తని పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోకనాథ్‌... నేడు ప్రెస్‌మీట్‌ పెట్టి పోలీసుల సంరక్షణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మున్సిపల్‌ వైస్‌చైర్మన షెక్షావలి, కౌన్సిలర్‌ మల్లికార్జున మండిపడ్డారు.

వైసీపీ హయాంలో మీ సంఘం ఏమైంది?
సమావేశంలో మాట్లాడుతున్న వైస్‌చైర్మన, నాయకులు

తాడిపత్రి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో నా టి పాలకులు పోలీసులను ఎంత నీచంగా మాట్లాడినా నోరెత్తని పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు త్రిలోకనాథ్‌... నేడు ప్రెస్‌మీట్‌ పెట్టి పోలీసుల సంరక్షణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మున్సిపల్‌ వైస్‌చైర్మన షెక్షావలి, కౌన్సిలర్‌ మల్లికార్జున మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. ‘త్రిలోకనాథ్‌ .... వైసీపీ ప్రభుత్వంలో ప్రకాష్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌ టీఏ, డీఏల గురించి.. సరెండర్‌ గురించి అడిగినందుకు డిస్మిస్‌ చేశారు. అప్పుడు మీ పోలీసు అధికారుల సంఘం ఏమైంది. కడప ఇంటలిజెన్స సీఐ మీద దాడిచేసినపుడు మీ సంఘం ఎక్కడికి వెళ్లింది. మాజీ మంత్రి రోజా సీఐని చెప్పుతో కొడతా అంటే ఏమైంది మీ పోలీసు సంఘం. అప్పుడు ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టలేదు. కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రెస్‌మీట్లు పెడతావా..? గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ప్రెస్‌మీట్‌ పెట్టావా.. మీకు జగనమోహనరెడ్డి అంటే అంత భయమా లేక భక్తా...? అసలు నీ పోలీసు అధికార సంఘానికి రిజిస్ట్రేషన ఉందా. ఉంటే దాన్ని పత్రికాముఖంగా తెలియజేయండి. 30 సంవత్సరాల నుంచి అనంతపురం పట్టణ పరిసరాల్లోనే పనిచేస్తున్నారు. ఏరోజైనా యూనిఫాం వేసుకొని డ్యూటీ చేశావా..? తిరుపతికి బదిలీ అయితే అనంతపురంలోనే ఎస్పీ ఆఫీసు వద్ద ఉంటూ టైం పాస్‌ చేసుకొంటూ తిరుగుతున్నావు. ఏ.. నీకు రూల్స్‌ వర్తించవా. ఏఎస్పీ రోహితకుమార్‌... మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పాలి. ఆయన కాళ్లు విరగ్గొడతాం.. గన్నుతో కాలుస్తాం.. అంటే మేం గాజులు తొడుక్కొని ఉండాలా..? గత ప్రభుత్వంలో మేం పోలీసులతో కొట్టించుకొని అక్రమ కేసులు పెట్టించుకొని జైలు పాలయ్యాం. ఇప్పుడు కూడా ఏఎస్పీ ఇష్టం వచ్చినట్లు అక్రమ కేసులు పెడుతుంటే ఊరుకోవాలా..? యాడికి మండలం వెంగన్నపల్లిలో తెలుగుదేశం కార్యకర్తపై వైసీపీ వారు దాడిచేసి గాయపరిస్తే ఈరోజు వరకు వారిని అరెస్ట్‌ కూడా చేయలేదు. పైగా పదిరోజుల తర్వాత ఏఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకొని బాధితులపైనే రేప్‌ కేస్‌ నమోదు చేయించారు. అసలు ఎటువంటి వైద్యపరీక్షలూ చేయకుండానే రేప్‌ కేస్‌ ఎలా పెట్టారు..? అనంత వెంకటరామిరెడ్డి.. మీ వైసీపీ నాయకుల దౌర్జన్యాలు.. తాడిపత్రిలో అప్పటి డీఎస్పీ చైతన్య అరాచకాలు నీకు కనబడలేదా..? ఈరోజు నీకు రాజ్యాంగం గుర్తుకు వస్తోందా...? మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలో అన్ని అరాచకాలు చేసినప్పుడు ఒకరోజు కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి ఖండించలేదే. పెద్దారెడ్డి అంటే నీకు భయమా..? కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు కఠినంగా ఉన్నాయి కాబట్టే మీరంతా ఇలా స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు’ అని అన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 12:10 AM