Share News

పెద్దారెడ్డి విషయం ఏం చేశారు..?

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:23 AM

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి నిరసనకు దిగారు. తాడిపత్రిలోని డీఎస్పీ కార్యాలయం వద్దకు సోమవారం వెళ్లిన ఆయన, ఏఎస్పీ రోహిత కుమార్‌ చౌదరిని ఈ విషయమై ప్రశ్నించారు. ‘కోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డి ఐదు వాహనాల్లోనే తిరగాలి. అంతకంటే ఎక్కువ వాడుతున్నారు.

 పెద్దారెడ్డి విషయం ఏం చేశారు..?

తాడిపత్రి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి నిరసనకు దిగారు. తాడిపత్రిలోని డీఎస్పీ కార్యాలయం వద్దకు సోమవారం వెళ్లిన ఆయన, ఏఎస్పీ రోహిత కుమార్‌ చౌదరిని ఈ విషయమై ప్రశ్నించారు. ‘కోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డి ఐదు వాహనాల్లోనే తిరగాలి. అంతకంటే ఎక్కువ వాడుతున్నారు. సెక్యూరిటీ ఖర్చులను ఆయన ప్రభుత్వానికి చెల్లించలేదు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా పట్టించుకోలేదు. మేము ఏ ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోరా..?’ అని నిలదీశారు. కార్యాలయం లోపలికి వస్తే అని విషయాలు చెబుతానని ఏఎస్పీ అనగా, చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే లోపలికి వస్తానని ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. దీంతో ఏఎస్పీ లోపలికి వెళ్లిపోయారు. ఆయన తీరుకు నిరసనగా జేపీ ప్రభాకర్‌ రెడ్డి అక్కడే కుర్చీలో బైఠాయించారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో గుత్తి రోడ్డులోని అశోక్‌ పిల్లర్‌ వద్దకు వెళ్లి నిరసన కొనసాగించారు. మంచం తెప్పించుకుని అక్కడే పడుకున్నారు. పోలీసుల తీరుపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జూలైలో ఆర్టీఏ అధికారులపై ఫిర్యాదు చేశాం. సర్‌ సీవీ రామన ఇంజనీరింగ్‌ కళాశాల మీద జెఎనటీయూ రిజిసా్ట్రర్‌కు ఫిర్యాదు చేశాం. ఇంటి వద్దకు వచ్చిన టౌన ప్లానింగ్‌ అధికారులను రమేష్‌ రెడ్డి దూషించాడు. యూట్యూబ్‌ చానల్‌ నాగరాజుపై కౌన్సిలర్‌ కొత్తపల్లి మల్లికార్జున ఫిర్యాదు చేశారు. కుమ్మరి నాగరాజు నుంచి వైసీపీ నాయకులు దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జావిద్‌పై షబ్బీర్‌ బాషా అలియాస్‌ గోరా ఫిర్యాదు చేశాడు. వైసీపీ నాయకులు ‘చంద్రబాబు రీకాల్‌’ ప్రోగ్రాం పెట్టారు. అప్పట్లో మేము రోడ్డు మీదకు వచ్చామని కేసులు బనాయించారు. పెద్దారెడ్డి కోడలు హర్షితా రెడ్డి, రమేష్‌ రెడ్డిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు..? మా అనుచరుడు పరమేష్‌, లింగమయ్య, నారాయణరెడ్డిని జిల్లా పోలీసులు తీసుకుపోయి చితకబాదారు..’ అని విమర్శించారు. రూరల్‌ సీఐ శివగంగాధర్‌ రెడ్డి, పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య, ఎస్‌ఐలు ధరణీబాబు, కాటమయ్య, రమణయ్య వెళ్లి ఆయనతో చర్చించినా నిరసన కొనసాగించారు. చివరకు సాయంత్రం 4:30 గంటల సమయంలో ఎస్పీ జగదీశతో మాట్లాడిన సీఐలు, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన నిరసన విరమించారు.

Updated Date - Sep 23 , 2025 | 12:23 AM