Share News

LEADERS: చేనేత చట్టాన్ని అమలు చేయాలి

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:38 AM

చేనేత 11 రకాల చట్టాన్ని పక్కా గా అమలుచేయాలని ఏపీ చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారా యణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కదిరిగేటు వద్ద గల నేతన్న విగ్ర హానికి పూలమాల వేశారు.

LEADERS: చేనేత చట్టాన్ని అమలు చేయాలి

చేనేత దినోత్సవంలోనాయకులు

ధర్మవరం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): చేనేత 11 రకాల చట్టాన్ని పక్కా గా అమలుచేయాలని ఏపీ చేతివృత్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జింకా చలపతి, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారా యణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కదిరిగేటు వద్ద గల నేతన్న విగ్ర హానికి పూలమాల వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ...చేనేత చ ట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరి స్తున్నారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరువల్ల చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయి, చివరికి కార్మికులు ఉపాధి లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో చేనేత సహకార సం ఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాడ్‌చేశారు. నేతన్న నేస్తం రూ. 24 వేల నుంచి రూ. 36వేలకు పెంచి, సొంత మగ్గం ఉన్న వారికి, అద్దె మగ్గాలు నేసే వారికి, చేతివృత్తులవారికి వర్తింపచేయాలని డిమాండ్‌చే శారు. అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యా దవ్‌కు చేనేతల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. చేనేత కార్మిక సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి, సీపీఐ నాయకులు రమణ, చేనేత నాయకులు చెన్నంపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:38 AM