నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:34 AM
నియోజకవర్గంలో సాగు - తాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు.
పుట్లూరు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో సాగు - తాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎంపీ అంబికా లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మండలంలోని కందిగోపుల పంచాయతీలో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం కింద ఏర్పాటు చేసిన పైప్ లైన్లను రూ. 1.50 లక్షలతో మరమ్మతులు చేయించారు. ఈ పథకం ద్వారా తాగునీటి సరఫరాను ఎంపీ, ఎమ్మెల్యే మంగళవారం పునఃప్రారంభించారు. అలాగే చింతకుంటలో రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని నిర్వీర్యం చేసిందని, దీంతో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తాయన్నారు. ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని పునఃప్రారంభించామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కులశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులనాయుడు, సర్పంచు శివరామయ్య, సింగిల్‌విండో అధ్యక్షుడు గోవర్దనరాజు, జయరాంరెడ్డి పాల్గొన్నారు.