Share News

లక్ష్యానికి మించి యూరియా ఇచ్చాం

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:03 AM

జిల్లాలో రైతులకు యూరియాను లక్ష్యానికి మించి ఇచ్చామని అవసరమైతే మరింత అందిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ జేడీఏ ఉమామహేశ్వరమ్మ సూచించారు.

లక్ష్యానికి మించి యూరియా ఇచ్చాం
అధికారులు, టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న జేడీఏ

కణేకల్లు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు యూరియాను లక్ష్యానికి మించి ఇచ్చామని అవసరమైతే మరింత అందిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ జేడీఏ ఉమామహేశ్వరమ్మ సూచించారు. సోమవారం మండలానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఏటా రైతులకు జిల్లా వ్యాప్తంగా 26 వేల మెట్రిక్‌ టన్నులను అందించామని, ప్రస్తుత ఏడాది ఇప్పటికే 38 వేల మెట్రిక్‌ టన్నులు అందించామని, ఇంకా ఎనిమిది వేల మెట్రిక్‌ టన్నులను కూడా అందించబోతున్నామని అన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. కణేకల్లు మండలంలో అధిగ విస్తీర్ణంలో వరి పంట సాగుచేస్తునానరని, ఎక్కువ మోతాదులో రైతులకు అవసరమైనంత వరకు యూరియాను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్‌ లాలెప్ప, బీటీ రమేష్‌, చంద్రశేఖర్‌గుప్తా, కురుబ నాగరాజు, ఏఓ జగదీష్‌, ఎంపీఈఓ లాలూస్వామి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:03 AM