చెరువులకు నీటి విడుదల
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:14 AM
మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి గ్రామాల చెరువులకు నీటిని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గురువారం విడుదల చేశారు.
పుట్లూరు, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుబ్బరాయసాగర్ నుంచి పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి గ్రామాల చెరువులకు నీటిని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గురువారం విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ చెరువులతోపాటు 29వ డిసి్ట్రబ్యూటరీ ద్వారా చివరి ఆయకట్టు అయిన బొప్పేపల్లి చెరువుకు కూడా నీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన డైరెక్టర్ సుదర్శననాయుడు, సింగిల్‌విండో డైరెక్టర్ గోవర్దనరాజు, నాయకులు ఓబులాపురం శ్రీనివాసులునాయుడు, చవ్వా కులశేఖర్‌రెడ్డి, శివరామయ్య, ఆదినారాయణరెడ్డి, శివశంకర్‌రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.