సమయపాలనకు నీళ్లు !
ABN , Publish Date - Sep 19 , 2025 | 11:52 PM
మండలంలోని దేవగిరి గ్రామ సచివాలయ సిబ్బంది విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బొమ్మనహాళ్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవగిరి గ్రామ సచివాలయ సిబ్బంది విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగులు విధులకు సక్రమంగా రావడం లేదని .. వచ్చినా కొంత సేపు ఉండి వెళ్లిపోతున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ సచివాలయాన్ని ఆంధ్రజ్యోతి విజిట్ చేసింది. ఇంజనీయర్ అసిస్టెంట్ మాత్రమే విధులకు వచ్చి గ్రామంలో స్మార్ట్ కార్డులు పంపిణీకి వెళ్లారు. ఇక మిగిలిన సిబ్బంది ఎవరూ విధులకు రాలేదు. కార్యాలయం మొత్తం ఖాళీగా ఉంది. పలు సమస్యలపై వచ్చిన గ్రామస్థులు .. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్తున్నారు. ఉద్యోగులు ప్రతి రోజు సక్రమంగా విధులకు రావడంలేదని, ఇష్టమొచ్చిన వేళకు వచ్చి వెళ్తున్నారని, పంచాయతీ కార్యదర్శి రెండు నెలలగా గ్రామానికి రావడం లేదని ఆ గ్రామస్థులు చెప్పారు.