Share News

సుబ్బరాయసాగర్‌కు జలకళ

ABN , Publish Date - Oct 24 , 2025 | 12:28 AM

మండలంలోని సుబ్బరాయసాగర్‌ రిజర్వాయర్‌కు పది రోజుల నుంచి హెచ్చెల్సీ నీరు చేరుతోంది. దీంతో ఇప్పటికే భూగర్భజలాలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సుబ్బరాయసాగర్‌కు జలకళ
సుబ్బరాయసాగర్‌కు చేరిన హెచ్చెల్సీ నీరు

పుట్లూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని సుబ్బరాయసాగర్‌ రిజర్వాయర్‌కు పది రోజుల నుంచి హెచ్చెల్సీ నీరు చేరుతోంది. దీంతో ఇప్పటికే భూగర్భజలాలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్‌ కింద 22 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ రిజర్వాయర్‌ నీటి సామర్థ్యం 0.480 టీఎంసీలు. ఇప్పటికే రిజర్వాయర్‌లో 309.150 మీటర్ల మేర నీరు చేరింది. నీరు గరిష్ఠ స్థాయి 317 మీటర్లకు చేరితే.. దిగువకు విడుదల చేస్తారు. దీంతో పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులకు తాగునీటి కోసం వాటిని మళ్లిస్తారు. వీటితో పాటు 29వ డిసి్ట్రబ్యూటర్‌ కింద సాగుచేస్తున్న నాలుగు వేల ఎకరాలకు నీటిని విడుదల చేస్తారు. వీటికి ఇటీవలే సుబ్బరాయసాగర్‌ నుంచి 29వ డిసి్ట్రబ్యూటర్‌ కాలువ ద్వారా బొప్పేపల్లి చెరువుకు నీటి విడుదలకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ప్రభుత్వంతో జీఓ తెచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - Oct 24 , 2025 | 12:29 AM