Waste తాగునీరు వృథా
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:20 AM
మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల బెస్తవీధిలోని బొడ్రాయి వద్ద పైపులైన లీకేజీ అవుతుండటంతో తాగునీరు రెండు నెలలుగా వృథాగా పోతోంది. ఇన్నిరోజులైనా సంబంధితాధికారులు పట్టించుకోలేదు.
కదిరిఅర్బన, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ్ల బెస్తవీధిలోని బొడ్రాయి వద్ద పైపులైన లీకేజీ అవుతుండటంతో తాగునీరు రెండు నెలలుగా వృథాగా పోతోంది. ఇన్నిరోజులైనా సంబంధితాధికారులు పట్టించుకోలేదు. అంతేకాకుండా తాగునీరు రోడ్డుపై పారుతుండడంతో ద్విచక్రవాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీరు నిల్వ ఉండటంలో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు. పార్నపల్లి నుంచి రూ.లక్షలు ఖర్చు చేసి కదిరికి తెప్పిస్తున్న తాగునీరు ఇలా వృథా అవుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.