Share News

యూరియా కోసం ఎండలో నిరీక్షణ

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:02 AM

యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. సోమవారం స్థానిక రూరల్‌బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌ సొసైటీలలో యూరియా పంపిణీ చేశారు.

యూరియా కోసం ఎండలో నిరీక్షణ
కణేకల్లులో యూరియా కోసం ఎండలో క్యూలో ఉన్న రైతులు

కణేకల్లు, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. సోమవారం స్థానిక రూరల్‌బ్యాంక్‌, ఆంధ్రాబ్యాంక్‌ సొసైటీలలో యూరియా పంపిణీ చేశారు. రైతులు యూరియా కోసం ఉదయం నుంచే క్యూలైనలలో పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు, టవాళ్లను వాటిని ఉంచి.. గంటలకొద్దీ వేచి ఉన్నారు. ఒక్కో ఆధార్‌కార్డుకు ఒక్కో యూరియా బస్తాను పంపిణీ చేశారు.

Updated Date - Sep 16 , 2025 | 12:02 AM