Share News

వరి కొనుగోలు కేంద్రాల కోసం నిరీక్షణ

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:09 AM

హెచ్చెల్సీ ఆయకట్టులో రైతులు పండించిన వరి ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ సారి దిగుబడి కూడా ఆశాజనంగా ఉంది

 వరి కొనుగోలు కేంద్రాల కోసం నిరీక్షణ
బొమ్మనహాళ్‌లో కోతకు సిద్ధంగా ఉన్న వరి మడి

కణేకల్లు/ బొమ్మనహాళ్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): హెచ్చెల్సీ ఆయకట్టులో రైతులు పండించిన వరి ధాన్యం విక్రయానికి సిద్ధంగా ఉంది. ఈ సారి దిగుబడి కూడా ఆశాజనంగా ఉంది. హెచ్చెల్సీ ఆయకట్టు కింద నీటి ఆధారంగా కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాల్లో ఈ పంట విస్తరంగా సాగు చేశారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురిసిన నేపథ్యంలో సకాలంలో హెచ్చెల్సీ కాలువకు సాగునీరు వచ్చాయి. దీంతో నార్లుపోయడం, నాట్లు వేయడం జరిగిపోయం ది. మొదట్లో యూరియా కొరత ఉన్నపట్టికీ.. వ ర్షాలు సమృద్ధిగా కురవడంతో వరికి మంచి జరిగింది. 10 రోజుల నుంచి హెచ్చెల్సీ ఆయకట్టులో పండిన ధాన్యాన్ని కోతలు కోస్తున్న రైతులు వాటిని పలుచోట్ల ఆరబెట్టుకుంటూ కొనుగోలు ధర కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని వేచి చూస్తున్నారు. కణేకల్లు, బొమ్మనహాళ్‌ మండలాలలో ఈ ఏడాది దాదాపు 35 వేల ఎకరాల దాకా హెచ్చెల్సీ ఆయకట్టు కింద పంటలు సాగుచేశారు. జిల్లాలోనే ధాన్యాగారంగా ఉన్న కణేకల్లు వరికి, బియ్యానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఏడాది కూడా సకాలంలోనే పంట చేతికిరాగా బహిరంగ మార్కెట్‌లో క్వింటాలు వరి రూ. 2200 వరకు ధర పలుకుతోంది.

దళారుల కుట్ర..: రైతులకు ప్రభుత్వం రూ.2389 మద్దతు ధర ప్రకటించింది. రైతు కష్టానికి తగ్గ న్యాయం జరగాలంటే ఈ ధర అమలు కావాలి. కానీ గ్రామాల్లో దళారులే ధర ను నిర్ణయించే స్థితి ఏర్పడింది. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ధరలను తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారు. క్వింటాల్‌ రూ 2100, రూ. 2200 వరకు నిర్ణయించారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖరీఫ్‌, రబీసీజనలో వరికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Dec 02 , 2025 | 12:09 AM