గ్యాస్ సిలిండర్ల కోసం నిరీక్షణ
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:09 AM
మండలంలోని ఉంతకల్లు గ్రామానికి వంట గ్యాస్ సిలిండర్లు సక్రమంగా సరఫరా కావడం లేదు. గ్రామానికి సిలిండర్ల వాహనం మూడు రోజులగా రోడ్డు పక్కన గంటల తరబడి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.
బొమ్మనహాళ్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఉంతకల్లు గ్రామానికి వంట గ్యాస్ సిలిండర్లు సక్రమంగా సరఫరా కావడం లేదు. గ్రామానికి సిలిండర్ల వాహనం మూడు రోజులగా రోడ్డు పక్కన గంటల తరబడి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. చెప్పిన తేదీలకు వాహనాలు రావడం లేదని, వచ్చినా పరిమిత సంఖ్యలోనే సిలిండర్లు ఇస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఉదయం నుంచే పని వదులుకోని సిలిండర్ల కోసం రోడ్డు పక్కన ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఏజన్సీ, సంబంధిత అధికారులు స్పందించి సక్రమంగా గ్యాస్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.