తహసీల్దార్ కార్యాలయంలోనే వీఆర్‌ఏ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:02 AM
స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనే ఓరువాయి వీఆర్‌ఏ రంగస్వామి మంగళవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓరువాయి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ రంగస్వామికి, దాయదులకు కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది.
భూమి వివాదంలో వీఆర్వో, మునుపటి తహసీల్దార్ అన్యాయం చేశారని ఆరోపణ
నల్లచెరువు, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోనే ఓరువాయి వీఆర్‌ఏ రంగస్వామి మంగళవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఓరువాయి గ్రామానికి చెందిన వీఆర్‌ఏ రంగస్వామికి, దాయదులకు కొన్నేళ్లుగా భూ వివాదం ఉంది. కోర్టుకు కూడా వెళ్లారు. సర్వే నంబరు 396/1, 396/2లో తనకు రావలసిన హక్కు భూమిని కూడా ఓరువాయి వీఆర్వో నిర్మల, గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన రవికుమార్ కలిసి మరొకరి పేరున పాసుపుస్తకం జారీ చేశారని బాధిత వీఆర్‌ఏ ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై అధికారుల వద్దమొరపెట్టుకున్నా, న్యాయం చేయలేదన్నారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించానన్నారు. గమనించిన తొటి ఉద్యోగులు నల్లచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కదిరి ఆస్పత్రికి, అక్కడి నుంచి అనంతపురం ఆసుపత్రికి తరలించారు. భూవివాదంపై వీఆర్వో నిర్మల మాట్లాడుతూ.. రంగస్వామి భూమి వివాదం కోర్టులో నడుస్తోందన్నారు. కోర్టులోఉన్న భూమికి ఇంజక్షన ఆర్డర్ లేకపోవడంతో ఉన్నతాధికారుల సలహా మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్వే చేశామన్నారు. రంగస్వామి సాగు విస్తీర్ణం కంటే అండగళ్‌లో ఎక్కువ భూమిని ఎక్కించుకున్నారన్నారు. రంగస్వామి దాయాదులు, పెద్ద మనుషుల సమక్షంలో హక్కు ఉన్న మేరకు పాసుపుస్తకంలో ఎక్కించామన్నారు.