Share News

ఘనంగా విశ్వకర్మ జయంతి

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:06 AM

పట్టణంలో విశ్వకర్మ భగవాన జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా విశ్వకర్మ జయంతి
ఉరవకొండలో విశ్వకర్మ చిత్రపటాన్ని ఊరేగిస్తున్న భక్తులు

ఉరవకొండ, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): పట్టణంలో విశ్వకర్మ భగవాన జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం నుంచి ఈశ్వరమ్మ గుడి వరకు ఆయన చిత్రపటాన్ని ఊరేగించారు. అలా గే ఐటీఐ కళాశాలలో విశ్వకర్మ చిత్ర పటానికి పూజలు చేశా రు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు కృష్ణాచారి గోపి, జగదీష్‌, తిప్పయ్య, ధనుంజయ, బీజేపీ నాయకులు లాలెప్ప, ఐటీఐ ప్రిన్సిపాల్‌ రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:07 AM