కిటకిటలాడిన అంజన్న ఆలయాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:01 AM
శ్రావణమాస చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని గుంతక ల్లు సమీపంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం, బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం, డీ.హీరేహాళ్ మండలంలోని మురడి ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.
గుంతకల్లు/బొమ్మనహాళ్/డీ.హీరేహాళ్, ఆగస్టు19(ఆంధ్రజ్యోతి): శ్రావణమాస చివరి మంగళవారాన్ని పురస్కరించుకుని గుంతక ల్లు సమీపంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం, బొమ్మనహాళ్ మండలంలోని నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయం, డీ.హీరేహాళ్ మండలంలోని మురడి ఆంజనేయస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడాయి. నెట్టికంటి మూల విరాట్టుకు వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలతో అలంకరించారు. రాత్రి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను వెండి రథంపై ఉంచి.. ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. నేమకల్లులో స్వామి వారికి తెల్లవారుజామున నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మురడి ఆంజనేయస్వామిని వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించారు.