Share News

Vasavimata ఘనంగా వాసవీమాత జయంతి

ABN , Publish Date - May 07 , 2025 | 11:39 PM

ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవీ మాత జయంతిని పలు ప్రాంతాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు.

Vasavimata ఘనంగా వాసవీమాత జయంతి
ధర్మవరంలో కలశాలతో ఊరేగింపుగా వెళ్తున్న ఆర్య వైశ్య మహిళలు

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌ : ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవత వాసవీ మాత జయంతిని పలు ప్రాంతాల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరంలో పాండురంగస్వామి ఆలయం నుంచి ఆర్యవైశ్య మహిళలు కలశాలతో కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య కొత్తసత్రంలో ఉయ్యాలోత్సవం నిర్వహించారు. అలాగే ముదిగుబ్బలో హరిహర గణేశ దేవాలయం నుంచి కన్యకాపరమేశ్యరి దేవాలయం వరకు, తనకల్లులో అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపులు నిర్వహించారు. తాడిమర్రిలో వాసవీమాత ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. నల్లచెరువులో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. బుక్కపట్నం కన్యకాపరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని బెంగుళూరు నుంచి తెప్పించిన పువ్వులతో అలంకరించారు.

Updated Date - May 07 , 2025 | 11:39 PM