వాసవీ అమ్మవారి ఫ్లెక్సీ చింపివేత
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:32 AM
స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఎదుట అర్యవైశ్య సంఘం ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన వాసవి అమ్మవారి ఫ్లెక్సీని బీజేవైఎం నాయకులు ఆదివారం రాత్రి బ్లేడ్‌తో కోసివేశారు.
గుంతకల్లుటౌన, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం ఎదుట అర్యవైశ్య సంఘం ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన వాసవి అమ్మవారి ఫ్లెక్సీని బీజేవైఎం నాయకులు ఆదివారం రాత్రి బ్లేడ్‌తో కోసివేశారు. అడ్డుకోపోయిన ఆర్యవైశ్య సంఘం నాయకులను దుర్భషలాడారు. దీన్ని నిరసిస్తూ ఆర్యవైశ్య సంఘం నాయకులు పెద్ద ఎత్తున వనటౌన పోలీ్‌సస్టేషన వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోపాజగదీష్ మాట్లాడుతూ... ఆ ఫ్లెక్సీలో వాసవీ మాత ఫొటో చిన్నదిగా వేసి.. ఆయిల్ కంపెనీకి చెందిన ఆడ్వర్టైజ్ ఎక్కువగా ఉందంటూ బీజేవైఎం నాయకులు కేశవ, చక్రపాణి మరో నలుగురు ఆ ఫ్లెక్సీని చించివేశారన్నారు. అడ్డుకోపోయిన తమ సంఘం నాయకులను దుర్భషలాడారన్నారు. ఫ్లెక్సీని చింపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో ఫ్లెక్సీని చించివేసిన కేశవతో పాటు మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆలయ ఎదుట ఆర్యవైశ్య సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. వనటౌన సీఐ మనోహర్ ధర్నా వద్దకు చేరుకుని ఆర్యవైశ్య సంఘం నాయకుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.