Share News

devotion భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:12 AM

వరలక్ష్మీవ్రత పూజలను అనంతపురం అర్బన, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

devotion భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం

న్యూస్‌నెట్‌వర్క్‌, (ఆంధ్రజ్యోతి): వరలక్ష్మీవ్రత పూజలను అనంతపురం అర్బన, రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.


ఈ సందర్భంగా వేకువజామునే ఆలయాల్లో అర్చకులు మూలవిరాట్‌లకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున వెళ్లి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు పొందారు. మహిళలు ఇళ్లల్లో వరలక్ష్మీ అమ్మవారిని కొలువుదీర్చి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే పలువురు మహిళను ఇళ్లకు ఆహ్వానించి వాయనాలు ఇచ్చారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 09 , 2025 | 01:13 AM