Share News

ఘనంగా వాల్మీకి జయంతి

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:00 AM

గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో వాల్మీకి మహర్షి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా వాల్మీకి జయంతి
ఉరవకొండ : వేడుకలో పాల్గొన్న మంత్రి కేశవ్‌

ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌ : గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో వాల్మీకి మహర్షి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాల్మీకి విగ్రహాలకు, చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌, రాయదుర్గంలో విప్‌ కాలవ శ్రీనివాసులు, గుంతకల్లులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్‌, టీడీపీ రాష్ట్ర ఉపాఽఽధ్యక్షుడు జితేంద్రగౌడ్‌, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి వాల్మీకికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వజ్రకరూరు, విడపనకల్లు, బొమ్మనహాళ్‌, కుందుర్పి, పామిడి, కూడేరు, బెళుగుప్ప, గుత్తి, గుమ్మఘట్ట, కణేకల్లు, యల్లనూరు మండల కేంద్రాల్లోనూ టీడీపీ నాయకులు, అధికారులు వాల్మీకి మహర్షికి పూజలు నిర్వహించారు.

Updated Date - Oct 08 , 2025 | 12:00 AM