జాతీయస్థాయిలో వజ్రకరూరు సర్పంచ సత్తా
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:21 AM
తన ప్రతిభతో వజ్రకరూరు సర్పంచి మోనాలిసా జాతీయ స్థాయిలో సత్తా చాటారు. భారత నాణ్యత మండలి దేశంలోని సర్పంచులకు ఆనలైనలో నిర్వహించే సర్పంచ సంవాద్ పోటీలలో మోనాలిసా జాతీయస్థాయిలో జూలై మాసానికి మొదటి స్థానంలో నిలిచారు.
ఉరవకొండ, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): తన ప్రతిభతో వజ్రకరూరు సర్పంచి మోనాలిసా జాతీయ స్థాయిలో సత్తా చాటారు. భారత నాణ్యత మండలి దేశంలోని సర్పంచులకు ఆనలైనలో నిర్వహించే సర్పంచ సంవాద్ పోటీలలో మోనాలిసా జాతీయస్థాయిలో జూలై మాసానికి మొదటి స్థానంలో నిలిచారు. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత అనే అంశం మీద తన ఆలోచనలు పంచుకుని రూ.35 వేల బహుమతికి ఎంపికయ్యారు. గతంలో ఆమె కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా ఆదర్శ పాఠశాలలో పనిచేశారు. అలాగే జూనలో ఢిల్లీలో నిర్వహించిన మహిళ ప్రాతినిఽథ్యం అనే కార్యక్రమంలో మొదటి స్థానం దక్కించుకున్నారు.