సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోండి
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:05 AM
సోలార్‌ను వినియోగించుకుని విద్యుత ఆదా చేసేందుకు రూపొందించిన సూర్య ఘర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే గుమ్మనూరు జయరాం, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్ కోరారు.
గుత్తి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): సోలార్‌ను వినియోగించుకుని విద్యుత ఆదా చేసేందుకు రూపొందించిన సూర్య ఘర్ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మె ల్యే గుమ్మనూరు జయరాం, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన వెంకటశివుడు యాదవ్ కోరారు. స్థానిక ఓ ఫంక్షన హాల్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారు ఈ పథకంపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో అధికారులు, మార్కెట్ యార్డు చైర్మన సూర్యప్రతాప్, పట్టణ, మండల అధ్యక్షులు ఎంకే చౌదరి, బద్రివలి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చికెన శీనా, రమేష్, రాజా, నాయకులు పవనకుమార్, న్యాయవాది సోమశేఖర్, ఆంధ్రసోలార్ ఎంటర్‌ప్రైజస్ ప్రతినిధులు క్రాంతి, బీజేపీ నాయకులు ఓబలయ్య పాల్గొన్నారు.